అరులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాల సాధనకై

– ఫిబ్రవరి 9న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి
– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంటేశ్వర్
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాల సాధనకై ఫిబ్రవరి 9న చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూమ్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని నేటికీ లక్షల సంఖ్యలో పేదలకు ఇల్లు లేక పూరిగుడిసెలో నివాసం ఉన్నారని డబుల్ బెడ్ రూమ్ హామీ అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేయాలని అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ సమావేశంలో అత్యధిక నిధులు కేటాయించి ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ఇప్పటికే ఇండ్ల కోసం లక్షల సంఖ్యలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు చూపటం లేదని ఇల్లు లేని నిరుపేదల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు ప్రభుత్వ తీసుకొచ్చిన పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని స్థలం లేని వారికి స్థలం కేటాయించి అందులో పక్క డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేసి ఇవ్వాలని లేని పక్షంలో ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు వెంటనే పేదలకు అందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిచోట ఫిబ్రవరి 9న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలు ఇంటి స్థలాలు లేని వాళ్ళు మరియు నిజామాబాదు నుండి పెద్ద ఎత్తున ఇల్లు లేని వాళ్లు ఇంటి స్థలం ఉండి డబ్బులు లేని వాళ్ళు పెద్ద ఎత్తున కదలాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల పోరాట ఐక్యవేదిక జిల్లా నాయకులు పెద్ది వెంకట్రావు, నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్,s లత , అనిల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.