– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/కూకట్‌పల్లి
ఆపదలో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. కేపీహెచ్బి డివిజన్‌కు చెందిన నేతల కనకారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అతని కుటుంబానికి పార్టీ నుంచి రూ.2లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే రూ.2 లక్షల బీమా చెక్కును అతని భార్య ఝాన్సీకి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారన్నారు. ఇటువంటి గొప్ప నాయకుల నాయకత్వంలో పనిచేయడం అదష్టంగా భావిస్తున్నానని అన్నారు.