చల్లా పాపిరెడ్డికి ఘన నివాళి..

నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ నివాసి స్వర్గీయ చల్లా పాపిరెడ్డి గారికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. డిసిసి అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి తండ్రి చల్లా పాపిరెడ్డి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం చల్లా పాపిరెడ్డి సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కెవిపి రామచంద్రరావు, మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసిసి కార్యదర్శి వంశి చందర్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి, కొమరయ్య, నాగర్కర్నూల్ డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ, మహబూబ్ నగర్ డిసిసి కొత్వాల్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మల్ రెడ్డి రాంరెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, చిగురింత పారిజాత నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, దండెం రాంరెడ్డి, కార్పొరేటర్ చల్లా బాల్రెడ్డి, సిద్దాల శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు దేవగోని కృష్ణ, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి నిమ్మల వెంకటేష్ గౌడ్, కీసర మాజీ వార్డ్ మెంబర్ యాదిరెడ్డి, ఏడు దొడ్ల, సురేందర్ రెడ్డి, ఆల శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Spread the love