నవతెలంగాణ- సరూర్ నగర్
ఆర్కేపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర మొదటి రోజు నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అల్కాపురి కాలనీ చౌరస్తాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు పూలమాలతో నివాళులర్పించి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించి గడప గడపకు తిరిగి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ,కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, దేపసురేఖ, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగా రెడ్డి,కాంగ్రెస్ రామకృష్ణ పురం డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ నేత, బండి మధుసూదన్ రావు, ధనరాజ్ గౌడ్ ,మున్సిపల్ కార్పొరేషన్, డివిజన్ల అద్యక్షులు పాల్గొన్నారు.