నవతెలంగాణ-సరూర్‌నగర్
ఆర్టిస్టి క్లిక్ ది ప్రీ స్కూల్లో ఫ్లేమ్‌లెస్ కుకింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో చిన్నారుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల కూరగాయలతో నిప్పు లేకుండా వంటకాలను చేశారు. ఇందులో ప్రతిభకనబర్చిన వారికి మొదటి, ద్వితీయ, తతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతులను పాఠశాల ఫౌండర్, ప్రిన్సిపాల్ ఎం.నీలిమ అందజేశారు. ఈ సందర్భంగా ఎం.నీలిమ మాట్లాడుతూ.. ఫ్లేమ్ లెస్ కుకింగ్‌తో చేసిన వంటకాలు తినడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్ననాటి నుంచే విద్యార్థులకు ఎంతో విజ్ఞానం, నైపుణ్యత చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కో-ఫౌండర్ చక్రీ జాక్సన్, ఉపాధ్యాయలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.