ఇండియన్‌ నేషనల్‌ ఒలింపియాడ్‌లో నారాయణ స్కూల్‌ విజయదుందుభి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇండియన్‌ నేషనల్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ ఒలింపియాడ్‌లో నారాయణ స్కూల్‌ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, శరణి నారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ శిక్షణ క్యాంపునకు నారాయణ నుంచి అత్యధికంగా 33 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పోటీలో మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌కు 12 మంది, కెమిస్ట్రీ ఒలింపియాడ్‌కు తొమ్మిది మంది, ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కు ఐదుగురు, సైన్స్‌ ఒలింపియాడ్‌కు ఏడు మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. సైన్స్‌ ఒలింపియాడ్‌లో తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఒకరు ఎంపికైతే, వారు నారాయణ విద్యార్థులు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం కోసం ప్రత్యేకంగా సీవో స్పార్క్‌, ఒలింపియాడ్‌, ఈటెక్నో, మెడిస్పార్క్‌ వంటి ప్రోగ్రామ్‌లతో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. వాటికోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి మెటీరియల్‌ను రూపొందించామని పేర్కొన్నారు.