ఇబ్రహీంపట్నం మండల అధికారులను

– విధుల్లో నిర్లక్ష్యం సహించం
– హెచ్చరించిన జడ్పీ సీఈవో
– ఎంపీడీఓ కార్యాలయం అకస్మిక తనిఖీ
– సమయానికి రాని అధికారులపై
– ఆగ్రహం
– ఛార్జి,మెమో జారీకి ఆదేశం
– ఎంపీడీవో మొదలు జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు సమయానికి
– రాని వైనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌ హెచ్చరించారు. ఇబ్రహీం పట్నం మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన తనిఖీ సందర్భంగా మండల కార్యాలయంలో కేవలం ఇద్దరు అధికారులు మాత్రమే విధుల్లో ఉన్నారు. వారిలో ఒకరు మండల ఇంజనీరింగ్‌ అధికారి ఇంద్రసేనారెడ్డి కాగా, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన ఎంపీడీవో మొదలు సూపరిం టెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, మరో జూనియర్‌ అసిస్టెంట్‌తో పాటు ఆఫీస్‌ ఉదయం 9:30 గంటలకే సీఈవో దిలీప్‌కుమార్‌ మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తన వద్ద పెట్టుకున్నారు. పదిన్నర గంటల తర్వాత ఒక్కో అధికారి విధులకు వచ్చారు. 10:30 తర్వాత జూనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణ, ఆ తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణతో పాటు ఎంపీడీవో జయరామ్‌ విజరు కార్యాలయానికి వచ్చారు. వారిని సమయం ఎంత అవుతుందని, ఎన్ని గంటలకు విధు ల్లోకి రావాలని, ఎన్ని గంటలకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. వారి నుంచి పొంతన లేని సమాధానం రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో స్థాయి అధికార నిర్లక్ష్యం కారణంగానే సిబ్బంది విధులకు తమ ఇష్టం వచ్చినట్టు వస్తున్నా రన్నారు. హెడ్‌ క్వార్టర్‌ ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. తాను బీఎన్‌రెడ్డి నుంచి వస్తున్నానని చెప్పడంతో హెడ్‌ క్వార్టర్‌లో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి బీఎన్‌ రెడ్డి నుంచి విధులకు హాజరవుతున్నట్టు ఉన్నతాధి కారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు ఎంపీడీవో జయరామ్‌ విజరు సమాధానమిచ్చారు. అదే విధంగా ఉపాధిహామీ ద్వారా కారు అలవేన్స్‌ , వస్తున్న డ్రైవర్ను ఎందుకు నియమించుకోవడం లేదని ప్రశ్నించారు. మండల కేంద్రం నుంచే డ్రైవర్‌ ను ఉపయోగించుకుంటున్నాని, తన ఇంటి వద్ద నుంచి ఉపయోగించడం లేదని చెప్పడంతో అందు కు వెహికిల్‌ అలవెన్స్‌ విషయాల్లో రిపోర్టు తయారు చేయాలని తన వ్యక్తిగత ఉద్యోగి శ్రీనివాస్‌కు సూచించారు. అదే విధంగా క్యాష్‌బుక్‌ నమోదు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపీడీఓ పర్యవేక్షణలేకపోడం వల్లనే విధి నిర్వాహణలో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. కాగా సూపరింటెండెంట్‌ క్రాంతికిరణ్‌ సెలవుపై వెళ్లినట్టు సెలవు పత్రాన్ని ఎంపీడీవో సూచించారు. అదే విధంగా కార్యాలయ సబార్డీనేటర్‌ కూడా ఆదివారం విధుల్లో ఉండటం వల్ల బుధవారం సెలవు ఇచ్చినట్టు చెప్పారు. దాంతో మిగిలిన సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఎంపీడీవోలకు చార్జి మెమో ఇస్తున్నట్లు చెప్పారు. దాంతో జడ్పీ సీఈవో ఆకస్మిక తనిఖీలతో మండల పరిషత్‌ కార్యాలయంలో క్షేత్రస్థాయి సిబ్బందిలో వణుకు పుట్టించింది. ఇదే తరహా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.