ఈసీఐఎల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

నవతెలంగాణ-కాప్రా
ఈసీఐఎల్‌ సీఎంఎస్‌ శ్రీ చైతన్య కళాశాల వద్ద విద్యార్థులు ఘర్షణ పడడం బుధవారం కలకలం రేపింది. ఓ విద్యార్థుల గుంపు మరి కొందరి విద్యార్థులను పరిగెత్తించుకుంటూ కొడుతున్న దృశ్యాలు చూసిన స్థానికులు భయాందోళన చెందారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉదయం, సాయంత్రం సమయాలలో ఈసీఐఎల్‌ పరిసర కళాశాలల వద్ద సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, కుషాయిగూడ పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.