ఉత్తరాదికి జీస్వ్కేర్‌ హౌసింగ్‌ విస్తరణ

హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ కంపెనీ జీస్వ్కేర్‌ హౌసింగ్‌ ఉత్తర భారతదేశానికి విస్తరించినట్లు ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ హైదరాబాద్‌, మైసూరులలో కార్యకలపాలు ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో 10 నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించినట్లు పేర్కొంది. వీటిలో కర్నాటకలో ఓ ప్రాజెక్టు విలువ రూ.1000 కోట్ల, హైదరాబాద్‌లో రూ.2500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. త్వరలోనే పూణె, జైపూర్‌లలో సైతం విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించిట్లు జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ వెల్లడించారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా మార్కెట్‌ల లో తాము అద్భుతమైన ప్రదర్శన కొనసాగించామన్నారు. త్వరలోనే ఉత్తర భారతదేశంలో కూడా కార్యకలాపాలు విస్తరించనున్నామన్నారు.