కావేరీ సీడ్స్‌కు రూ.275 కోట్ల లాభాలు

హైదరాబాద్‌ : ప్రముఖ విత్తన కంపెనీ కావేరీ సీడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 12.68 శాతం వృద్థితో రూ.275.62 కోట్ల నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.244.60కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.685.59 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ1లో 7.37 శాతం పెరిగి రూ.736.10 కోట్లకు చేరిందని ఆ సంస్థ తెలిపింది.

Spread the love