ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం

నవతెలంగాణ-ధూల్‌పేట్‌
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కష్ణ నాయక్‌ అన్నారు. డీవైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జంగంమేట్‌ సీఐటీయూ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) 1980లో పంజాబ్‌లోని లూథియానా, సరబా గ్రామంలో ఆవిర్భావించింది అని గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత యువజన సంఘంగా, కోటి సభ్యత్వంపై గల యువజన సంఘం డీవైఎఫ్‌ఐకి గుర్తింపు ఉందన్నారు. దేశంలో ఉపాధి లేక ఉద్యోగ ఉపాధి పని అవకాశాలు కల్పించాలని యువత కోసం పోరాటం చేస్తుందని అన్నారు. తక్కువ ఉపాధి ఉన్నది బీజేపీ మోడీ పాలనలోనేనని, ఈ సమయంలో 5 కోట్ల ఉపాధి అవకాశాలను కోల్పోపోయారన్నారు. మోడీ నిర్ణయాల వల్ల దేశంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని, ముఖ్యంగా కరోనా కాలంలో యువకులు అనేక కష్టాలు ఎదుర్కొరని చెప్పారు. భారతదేశంలోకి 20 శాతం ఉద్యోగాలు సాధన వేతనాలతో భద్రతతో కూడినది మాత్రమే ఉంది అన్నారు. మిగతా వాటికి భద్రత లేదని, అందుకే దేశంంలో యువత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నోటీఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు కిషన్‌, శ్రీను, రాంకుమార్‌, రాజేష్‌, చిన్న ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.