నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సోమ వారం హైదరాబాద్ ,విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ చౌరస్తాలో దాదాపు నలభై నిమిషాలు బైఠాయించి ధర్నాకు దిగారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ 9 సంవత్సరాలు అవుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలను మోసం చేస్తున్నదని, ఒకపక్క వేలాది ఖాళీలతో వివిధ డిపార్ట్మెంట్‌లలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన సందర్భంగా వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలకు దక్కాల్సిన వేలాది ఉద్యో గాలు కోల్పోతున్నామని, విద్య ఉద్యోగ రంగంలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులా లకు సైతం రిజర్వేషన్లు తీసుకొచ్చి డిమాండ్ ఉన్న రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్గీకరించుకునే హక్కు ఉందని చెప్పిన బీజేపీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాత్రం చేయకుండా మాదిగలకు నమ్మకద్రోహం చేస్తున్న దన్నారు. మాదిగలను మోసం చేసిన పార్టీలన్నీ రాష్ట్రంలో దేశంలో భూస్థాపితమైనట్టుగానే బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామని తెలిపారు. వర్గీకరణ చేయకుంటే మందకష్ణ మాదిగ నాయకత్వంలో బీజేపీకి రాజకీయంగా బుద్ధి చెబుతామని, మాదిగ వాడల్లోకి, మాదిగ పల్లెలోకి బీజేపీని రానివ్వకుండా తరిమి కొడతా మని హెచ్చరించారు. రహదారిపై బైఠాయించిన ఎమ్మార్పీ ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి 36 మందిని బాలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమ శేఖర్ మాదిగ, ఎంఎస్‌పీ ఎల్బీనగర్ నియోజకవర్గం కన్వీ నర్ బత్తిని సుధాకర్ మాదిగ, మాదిగ మహిళ సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు జెపి లత మాదిగ, ఎంఎస్‌పీ నాయ కులు నాగభూషణం, డల్ల సురేష్, పెద్దింటి గీత, సుజాత, డప్పు మల్లికార్జున్, టీ.వి నరసింహా, ఎమ్మార్పీఎస్ నాయకులు కనక ప్రమోద్, శనిగారపు మురళీకష్ణ, ప్రణీత్, రఘువరన్, కమలాకర్ తదితరులు ఉన్నారు.