ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్‌ మ్యాక్స్‌ కార్మికులు

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల సూపర్‌ మాక్స్‌ కంపెనీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను అసెంబ్లీ వేదికగా మాట్లాడి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లిన కుత్బుల్లా పూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ ను సోమవారం కార్మికులు ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం మధ్య నెలకొన్న గొడవ కారణంగా ఏడు నెలలుగా కంపెనీ నడవక, కార్మికులకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడటంతో తమకు కొంత ధైర్యం వచ్చిందని కార్మిక నాయకులు. జి.ఎస్‌ .లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కార్మికులు కార్మికులు పాల్గొన్నారు.,