ఎమ్మెల్యేకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యుల కతజ్ఞతలు

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
నాయి బ్రాహ్మణుల సమస్యలను అసెంబ్లీ వేదికగా మాట్లాడి, ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి, కతజ్ఞతలు తెలిపారు. కులవత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు కార్పొరేట్‌ వ్యక్తులు, ఇతర కులస్తులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు సెలూన్‌ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాయి బ్రాహ్మణులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక జీవో జారీ చేస్తే వారికి న్యాయం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు ఎ.రేణయ్య నాయి, ప్రధాన కార్యదర్శి కే పరమేష్‌ నాయి, చైర్మెన్‌ రవిబాబు నాయి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి సురేష్‌ నాయి, గౌరవ అధ్యక్షులు మైలారం యాదగిరి నాయి, సలహాదారులు (సంకల్ప దీక్ష సష్టికర్త) పంబి శ్రీనివాస్‌ నాయి, బిక్షపతి నాయి, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రచార కార్యదర్శి పి.శివకుమార్‌ నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజా యువజన అధ్యక్షులు వి. ఎస్‌.ఆర్‌.వెంకట్‌ నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.