ఎమ్మెల్సీ కవిత  కృతజ్ఞతలు తెలిపిన స్పౌజ్ ఫోరం సభ్యులు 

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నందిపేట కేదారేశ్వర ఆలయంలో స్పౌజ్ ఫోరం సభ్యులు ఎమ్మెల్సీ కవిత ని కలిసి 615 స్కూల్ అసిస్టెంట్స్ స్పౌజ్ బదిలీలు ప్రభుత్వం చేపట్టినందుకు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుండి తమకు అండగా ఉండి ధైర్యం చెప్పి స్పౌజ్ సమస్యను పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినందుకు కవితకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం కేవలం 30% బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా మిగిలిన ఎస్ జి టి, భాషపండితులు, పీఈటి ల స్పౌజ్ బదిలీల విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా జరిపించాలని ఎమ్మెల్సీ కవిత ని వేడుకున్నారు. ఇందులో మెజారిటీ మహిళ ఉపాధ్యాయినీలె ఉన్నారనీ వారు తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారని పేర్కోన్నారు. ఎస్ జి టి ల విషయంలో పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండడంతో పాటు ప్రస్తుతం జరగబోయే ప్రమోషన్ లో కూడా ప్రతి జిల్లాకు 200-250 ఖాళీలు ఏర్పడనున్నాయి కాబట్టి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని దయచేసి సాధ్యమంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.