ఎల్బీలో నేడు మెగా చెస్‌ టోర్నీ

–  33 జిల్లాల్లో కెసిఆర్‌ చాంపియన్‌షిప్‌
హైదరాబాద్‌ : సీఎం కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు శాట్స్‌ మెగా టెస్‌ టోర్నీ నిర్వహిస్తోంది. గురువారం 33 జిల్లాల్లో మహిళల విభాగంలో జరిగిన చెస్‌ పోటీల్లో 40 వేల మంది పోటీపడ్డారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు నేడు ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఎత్తులకు పైఎత్తులు వేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జిల్లా చెస్‌ పోటీలను శాట్స్‌ యంత్రాంగంతో కలిసి చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ ప్రారంభించారు. జిల్లా స్థాయి విజేతలకు స్థానికంగా మెడల్స్‌, ప్రశంసా పత్రాలు అందజేశారు. అన్ని జిల్లాల నుంచి చెస్‌ క్రీడాకారులు ఏకకాలంలో సిఎం కెసిఆర్‌కు సామూహిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.