మినహాయింపు లేదు!

No exception!– 25, 26న రెజ్లింగ్‌ ట్రయల్స్‌
న్యూఢిల్లీ : ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) జాతీయ ట్రయల్స్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఆగస్టు 25, 26న రెండు రోజుల పాటు పటియాలలోని సారు సెంటర్‌లో ట్రయల్స్‌ నిర్వహిస్తామని అడ్‌హాక్‌ ప్యానల్‌ చీఫ్‌ భూపిందర్‌ సింగ్‌ భజ్వా వెల్లడించారు. ఆసియా క్రీడల ట్రయల్స్‌ నుంచి వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియాలకు మినహాయింపు ఇవ్వటంతో రెజ్లింగ్‌ వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ చాంపియ న్‌షిప్స్‌ ట్రయల్స్‌ నుంచి ఎవరికీ మినహాయి ంపు ఇవ్వలేదు. ఒలింపిక్స్‌ సహా అన్ని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పోటీపడిన, విజేతలుగా నిలిచిన రెజ్లర్లు అందరూ ట్రయ ల్స్‌లో పోటీపడాలని, ఎవరికీ మినహాయింపు లేదని తెలిపారు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సెప్టెంబర్‌ 16-24న సెర్బియాలో జరుగనుండగా.. ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 23న ఆరంభం కానున్నాయి.

Spread the love