ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ

– గ్రూప్‌-4కు 9.51 లక్షల దరఖాస్తులు
– ముగిసిన దరఖాస్తుల స్వీకరణ : టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-4 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. గ్రూప్‌-4కు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ పడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌-4 పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. జులై ఒకటో తేదీన ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2ను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇతర వివరాలకు ష్ట్ర్‌్‌జూర:// షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలని అధికారులు సూచించారు.