ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ

–   గ్రూప్‌-3కి 5.36 లక్షల దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌ -3 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. 1,375 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్‌-3 పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. రాతపరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేసి ప్రకటిస్తామని తెలిపారు.