ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ తత్కాల్‌ ఫీజు గడువు పెంపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తత్కాల్‌ ద్వారా ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈనెల పదో తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) డైరెక్టర్‌ పివి శ్రీహరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ లేదా మేలో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు రూ.500, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు రూ.వెయ్యి తత్కాల్‌ ఫీజుతోపాటు వార్షిక ఫీజును కూడా చెల్లించాలని కోరారు.