ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనతో ఐఏఎస్‌ అయ్యాను

– ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణ
నవతెలంగాణ-కల్చరల్‌
వరంగల్‌ లో ఉద్యోగి గా ఉన్న సమయంలో కలెక్టర్‌ కార్యాలయంలో రేషన్‌ కార్డ్‌ కోసం వెళ్తే అక్కడ ఉద్యోగి నిర్లక్ష్య ప్రవర్తనతో తానే రేషన్‌ కార్డ్‌ ఇచ్చే స్థాయికి రావాలని ఐ.ఏ.ఎస్‌ చదివి సాధింఛానని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కే.వీ.రమణాచారి చెప్పారు. ఏ పాఠశాలలో చది వాము, ఏ భాషా లో చదివాము ముఖ్యం కాదనేది నేటి యువత గ్రహించాలని, పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సాధించవ చ్చని ఆయన అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభ లో ప్రధాన వేదిక పై జీ. వీ.ఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ నిర్వహ ణలో డాక్టర్‌ రమణాచారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పేరిట ప్రతిభా పురాస్కరాలు సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, కళా పోషకుడు రాఘవ రెడ్డి కి,నాట్య గురువు సజనికి ప్రదానో త్సవం సభ జరిగింది. డాక్టర్‌ రమణ మాట్లాడుతూ పురస్కారా గ్రహీతలు వారి రంగంలో ప్రముఖులని అభినందించారు. ముఖ్యమంత్రులు వద్ద పని చేసి మెప్పు పొందటం సులువు కాదని వివరించారు చిల్ల రాజశేఖర రెడ్డి అధ్యక్షత వహించిన సభలో రామ కష్ణ, దామరాజు శ్రీనివాసరావు, టివీ న్యూస్‌ రీడర్‌ విజయ చంద్రిక తదితరులు పాల్గొన్నారు. వెంకట రెడ్డి స్వాగతం పలికిన సభలో కవి వెంకట దాసు వ్యాఖ్యానించారు