– మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు
కేప్‌టౌన్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌కు షాక్ ఇస్తూ తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు నేడు మెగా మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోన్నారు. ఐదుసార్లు చాంపియన్, మహిళల క్రికెట్ అగ్రజట్టు ఆస్ట్రేలియాతో నేడు టైటిల్ పోరులో సఫారీలు పోటీపడనున్నారు. ప్రపంచ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు దక్కని ఐసీసీ టైటిల్‌ను మహిళల జట్టు సాధిస్తుందేమో చూడాలి. ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. భావోద్వేగాలతో కూడిన సఫారీ శిబిరాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సాయంత్రం 6.30 గంటలకు వరల్డ్‌కప్ ఫైనల్ ఆరంభం కానుంది.