కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు

నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
డీజీపీ కార్యాలయంలో గత పది రోజులుగా సాగిన కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ పది రోజుల్లో డీజీపీ కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులూ, సిబ్బంది, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ కలిపి మొత్తం 1154 మందికి కంటి పరీక్షలు డాక్టర్లు నిర్వహించారు. ఇందులో 515 మందికి అద్దాలను ఇవ్వగా.. మరో 312 మందికి కంటికి సంబంధించి తదుపరి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ సందర్భంగా ‘కంటి వెలుగు’ లో పాల్గొన్న డాక్టర్లు, ఇతర మెడికల్‌ సిబ్బంది డీజీపీ అంజనీ కుమార్‌ వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు.