– ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశంలో నెలకొన్న మతోన్మాద ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని.. అది కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ఎం సీపీఐ (యూ) పోలిట్ బ్యూరో నిర్ణయం చేసింది. ఎంసీపీఐయు పోలిట్ బ్యూరో సమావేశం ఫిబ్రవరి 11, 12 తేదీలలో హైదరాబాద్ ఓంకార్ భవన్ బీయన్ హల్ లో సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యుడు కిరణ్ జిత్ సింగ్ షేఖన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికా యల అశోక్ ఓంకార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రధానంగా మతం ఎజెండాతో మెజారిటీ ప్రజలను విభజిస్తున్నదని అన్నారు మోడీ, షాల పాలనలో ప్రజల మౌలిక సమస్యలను విస్మరించి కేవలం కార్పోరేట్ సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం తీసుకున్న సంస్కర ణల వల్ల బ్యాంకు లు ,జీవితా బీమా సంస్థలు అనేక పబ్లిక్ రంగ సంస్థలు దివాళా తీస్తున్నాయన్నారు. మనుస్మతిని తీసుకురా వాలని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నదని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం లను తన ఫాసిస్టు ఆలోచనతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నదని, ఎన్నికల రంగాన్ని అత్యంత ఖరీదైన సరుకుగా మారుస్తున్నారన్నారు. కమ్యూనిస్టు, అంబేద్కర్, పూలే, పెరియార్, బుద్ధిష్ట్ శక్తులు అన్ని ఐక్య వేదిక పైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) ముందుకు సాగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయిన సామాజిక స్పహతో వ్యవహారించాలన్నారు.ఈ సమావేశంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు అనుభవ్ దాస్ శాస్త్రీ, సుభాష్ చంద్ర, మోహన్ ప్రసాద్, గాదగోని రవి, మహేందర్ నేహా, శ్రీ కుమార్, వల్లేపు ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.