కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీపడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు

– పేద విద్యార్థుల విద్యాభివద్ధి లక్ష్యంగా ప్రభుత్వం
– రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-దుండిగల్‌
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల విద్యాభివద్ధి లక్ష్యంగా కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బుధవారం ప్రగతినగర్‌లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వసతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌, ఎడ్యుకేషనల్‌ కమిషనర్‌ దేవసేనలు హాజరై ప్రారంభిం చారు. ప్రగతినగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.68లక్షలతో అభివద్ధి చేసిన కాంపౌండ్‌ వాల్స్‌, తాగు నీరు, విద్యుత్‌, వంట గది, టాయిలెట్స్‌, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ వంటి వసతులను స్థానిక మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిజిటల్‌ తరగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీపడే విధంగా, కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్ళలో ఉండే వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే ‘మన ఊరు – మన బడి’ అని అన్నారు. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంతోపాటు విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యే విధంగా డిజిటల్‌ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యతోపాటు విద్యార్థులకు మంచి భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని సామాన్య, మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యాభి వద్ధి కోసం ప్రభుత్వం ఎనలేని కషి చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రమేష్‌, డీిఈఓ విజయ కుమారి, ఎంఈఓ ఆంజనేయులు, స్థానిక కమిషనర్‌ రామకష్ణ రావు, స్థానిక డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజ్‌ యాదవ్‌, స్థానిక కార్పొరేటర్‌ ఇంద్రజిత్‌ రెడ్డి, స్కూల్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీ నర్సింలు, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.