కాలనీ అభివృద్ధికి మోక్షం ఎన్నడో?

–  శ్రీనివాస కాలనీవాసుల ఆవేదన
నవతెలంగాణ-నాగోల్‌
నాగోల్‌ డివిజన్లోని అన్ని కాలనీలో కుమ్మరంగా అభివద్ధి పనులతో ముందుకు వెళ్తుంటే తమ కాలనీ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో అన్నట్లుగా ఉందని తమ కాలనీ అభివృద్ధికి మోక్షం ఎప్పుడు వస్తుందోనని శ్రీనివాస కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్‌ కాలనీ నుండి నూతనంగా నిర్మితమైన ముక్తి ఘాట్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో తమ కాలనీ ఉందని, దీంతో కాలనీ చివరిగా ఉండడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వీధి దీపాలు తదితర అభివద్ధి పనులకు నోచుకోలేకపో తుందని కాలనీవాసులు వాపోతున్నారు ప్రధానదారికి ఇరువైపులా సుమారు 16 రోడ్లు కలిగిన ఈ కాలనీలో ఒక్క రోడ్డు తప్ప మిగిలిన రోడ్లన్నీ మట్టితో దర్శనమిస్తున్నాయి. దీంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపో వడం ఖాళీ జాగలు కలిగిన యజమానులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడంలేదని కాలనీలోని కొంతమంది చర్చించుకోవడం వినిపించింది. ఇప్పటికే నిర్మాణం చేపట్టి నివాసం ఉంటున్నవారు వీధి దీపాలు సక్రమంగా లేకపోవడంతో రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని అంటున్నారు. తమ కాలనీ చివరన ఉండడంతో ఇతర పరిసర కాలనీలలో కలిగిన చెత్తను కూడా రాత్రిల్లో ఇక్కడ పారబోయడంతో విపరీ తమైన దుర్వాసనతోందని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ,సంబంధిత అధికారులు ,స్పందించి తమ కాలనీ అభివద్ధి పై కూడా దష్టిని సారించి సిసి రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థను, త్రాగునీటి వసతిని కల్పిస్తూ, మెరుగైన విధి దీపాలను ఏర్పాటు చేయాలని శ్రీనివాస కాలనీ ప్రజలు కోరుతున్నారు.