‘కాశీ’ని చేరిన విశ్వం

ఓ కళాతపస్వీ!
రససిద్ధి పొందిన కళాస్రష్టా!
నీవొక సమున్నత
హిమశైలం,
కళాత్మక చిత్రాలకు చిరునామా.
సెలయేటికి నాట్యం నేర్పిన
నాట్యాచారుడవు నీవు.
”సిరివెన్నెల” వెలుగుల సాహసివి నీవు.
నీ గజ్జెల ఘల్లు
ప్రేక్షకుల గుండెల్లో ఝల్లు,
సరిగమలతో నీ ప్రేమలేఖలు
వారి హదయాల్లో చక్కిలిగింతలు.
నీ అమత గానాలు
అమితానంద హదయరాగాలు.

నాద వినోద నాట్య విలాసాలతో
మురిపించి,
సాహితీ సౌరభాలతో మైమరిపించి,
సత్సంప్రదాయ జ్యోతుల్ని వెలుగులీనించి,
నాట్యమే నీ చుట్టూ ప్రదక్షిణలు చేసేటట్లు
చేసుకొనిజి
నటరాజులో లీనమైన నిను చూసి
కళామతల్లి రోదిస్తోంది.

తెలుగు జాతికి గర్వకారణం,
భరతమాత ముద్దుబిడ్డవైన
నీవి వివిధ నేపధ్యాలు,
చిత్ర విచిత్ర వైవిధ్యాలు.
అందుకే నీవు కళాతపస్వివి.

– వేమూరి శ్రీనివాస్‌, 9912128967