కుక్కల దాడి-బాలుడి మృతి ఘటనపై

–  నేడు హైకోర్టు విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ అంబర్‌ పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రదీప్‌ అనే నాలుగేండ్ల బాలుడు మరణించినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ అంశంపై గురువారం విచారించనుంది ఇందులో సీఎస్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ఇతరులను ప్రతివాదులుగా చేర్చింది.