మరో 13 మంది అభ్యర్థుల డిబార్‌ : టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రశ్నాపత్రాల లీకేజీతో సంబంధమున్న మరో 13 మంది అభ్యర్థుల భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శాశ్వతంగా డిబార్‌ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో సంబంధమున్న 37 మంది అభ్యర్థులను మంగళవారం డిబార్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో డిబార్‌ అయిన అభ్యర్థుల సంఖ్య 40కి చేరింది. ప్రశ్నాపత్రాల లీకేజీతో సంబంధమున్న 44 మంది అభ్యర్థులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటి వరకు 40 మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ డిబార్‌ చేసింది.

Spread the love