కేరళలో యువ న్యాయవాదులకు వేతన భృతి

– నెలకు రూ.3 వేలు చొప్పున అందజేత
తిరువనంతపురం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం మరో ప్రజానుకూల పథకాన్ని ప్రారంభించింది. యువ న్యాయవాదులకు నెలకు రూ.3 వేలు చొప్పున వేతన భృతి (స్టైఫండ్‌) అందజేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక పథకాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ఇక్కడ ప్రారంభించారు. రాష్ట్రంలోని రూ.లక్ష లోపు ఆదాయమున్న జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.మూడు వేలు చొప్పున ఈ పథకం కింద అందజేస్తారు. మూడేండ్లు ప్రాక్టీస్‌ మించకుండా 30 ఏండ్ల లోపు వయసున్న యువ న్యాయవాదులు ఈ పథకానికి అర్హులు.