కొత్త కలెక్టర్ కి అభినందనలు

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా  నూతన కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ హనుమంతుని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బృందం గురువారం కలిసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా వారు ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను, వెల్నెస్ సెంటర్ ను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్ గాంధీ హనుమంతు ఎల్లవేళలా పెన్షనర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్  బి.చంద్రశేఖర్, సంఘం జిల్లా అధ్యక్షులు కే.రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్. మదన్మోహన్, కోశాధికారి ఈ.వి.ల్. నారాయణ, జిల్లా నాయకులు నర్రా రామారావు, ముత్తారం నరసింహస్వామి, బోజారావ్, బాబా గౌడ్,  సాయన్న, శంకర్, దుర్గయ్య, రాధా కిషన్, అందే సాయిలు, తదితరులు పాల్గొన్నారు.