కొలీజియం కంటే మెరుగైనది లేదు

–  ఇది పర్‌ఫెక్ట్‌ మోడల్‌ : మాజీ ప్రధాన న్యాయమూర్తి లలిత్‌
న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థపై దాడి జరుగుతున్న సమయంలో.. కొలిజీయం వ్యవస్థ కంటే మెరుగైనదేదీ లేదని మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌ వ్యాఖ్యానించారు. న్యాయ నియామకాలు, సంస్కరణలపై జరిగిన ఓ సెమినార్‌లో ఆయన శనివారం మాట్లాడారు. ‘కొలీజియం వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థ మన దగ్గర లేదు. ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పర్‌ఫెక్ట్‌ మోడల్‌’ అని ఆయన అన్నారు. మన దేశంలో చాలామంది న్యాయమూర్తులు సాధారణంగా హైకోర్టు స్థాయిలో నియమితులవు తున్నారని, చాలా కొద్దిమంది మాత్రమే నేరుగా సుప్రీంకోర్టుకు నియమితులవుతున్నారని ఆయన అన్నారు.