క్రికెట్ కిట్ వితరణ

నవతెలంగాణ-రాజంపేట్
మండలంలోని పొందుర్తి గ్రామ యువకులకు కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు అంకం కృష్ణారావు క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా సుమారుగా 5000 రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్టు ను అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆయనను యువకులు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గడుగుల బాబు, గ్రామ యువజన అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.