క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

–  అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.ఎం.డోబ్రియాల్‌
నవతెలంగాణబ్యూరో-హైడరాబాద్‌
దేహ దారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ మాట్లాడుతూ అటవీ అధికారులు, సిబ్బంది అడవుల రక్షణలో నిత్యం విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. చార్మినార్‌, భద్రాద్రి, రాజన్న, యాదాద్రి, జోగులాంబ, బాసర, కాళేశ్వరం అటవీ సర్కిళ్లకు చెందిన అటవీ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. రన్నింగ్‌, కబడ్డీ, లాంగ్‌ జంప్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, డిస్కస్‌త్రో, క్యారమ్స్‌, చెస్‌, రైఫిల్‌ షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలు రెండు రోజుల పాటు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ (కంపా) లోకేష్‌ జైస్వాల్‌, ఫారెస్ట్‌ అకాడమీ ఇంచార్జి డైరెక్టర్‌ ఏలూసింగ్‌ మేరు, ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ఉన్నతాధికారులు సునీత భగవత్‌, వినోద్‌ కుమార్‌, రామలింగం, సైదులు, అన్ని సర్కిళ్లకు చెందిన అధికారులు, జిల్లాల అటవీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.