గిరిజనులకు బంజారాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

– ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
గిరిజనులకు బంజారాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లుగా అండగా ఉంటుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం బజరంగ్‌ బంజారా సేవా సంఘం గిరిజన హక్కుల సమావేశం అంబర్‌పేట డివిజన్‌ పరిధిలోని న్యూ పటేల్‌ నగర్‌లో సరస్వతి స్కూల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధికార ప్రతినిధి మహేష్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో, పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు రమేష్‌ నాయక్‌ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెంకటేశ్‌, కార్పొరేటర్‌ ఇ.విజరు కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంజారాహిల్స్‌లో బం జారా ఆత్మగౌరవ భవన్‌ నిర్మించడం జరిగిందని, అన్ని రకా లుగా వారికి అండగా ఉంటామని తెలియజేశారు. కార్పొ రేటర్‌ మాట్లాడుతూ బంజారా కులస్తులు కూడా రాజకీ యంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. బంజారా సంఘం నాయ కులు రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ బంజారా గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అలాగే గిరిజన బంధు త్వరగా అమ లయ్యే విధంగా చూసి అర్హులైన వారందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్య క్షుడు సిద్ధార్థ ముదిరాజ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు, బం జారా సంఘం నాయకులు జటావత్‌ రమేష్‌ నాయక్‌, వీరన్న నాయక్‌, చందర్‌ నాయక్‌, గోపాల్‌ నాయక్‌, మన్న య్య నాయక్‌, రవి నాయక్‌, లక్ష్మణ్‌ నాయక్‌, మెచ్చు నాయ క్‌, వెంకన్న నాయక్‌, అనిల్‌ నాయక్‌, చందు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.