చరిత్రను పరిశోధించండి, లిఖించండి

నవతెలంగాణ-కంటేశ్వర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్రను పరిశోధించి, అధ్యయనం చేసి, లిఖించాలని అఖిల భారతీయ ఇతిహాస సంకలన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు వి.కిషన్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ సమావేశం హాల్ లో ఇందూరు ఇతిహాస సంకలన సమితి నిర్వహించిన చరిత్ర దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన చరిత్ర మన ప్రాముఖ్యతను చదవాలని, చరిత్ర ను నేటితరానికి తెలియజేయాలనికోరారు. ప్రతివారు చరిత్ర నిర్మాతలు కావాలనిఅన్నారు. సిద్ద సాయరెడ్డి రచించిన బోధన్ చరిత్ర గ్రంధాన్ని గురు చరణం, బాల శ్రీనివాస మూర్తి, ప్రముఖ జిల్లా చరిత్ర కారుడు కందకుర్తి యాదవ రావులతో కలిసి ఆవిష్కరించారు. బోధన్ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉన్నదని ఆ చరిత్ర ను మరింత వెలికి తీయాలని కోరారు. చరిత్ర ను పునర్ లిఖించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ బాల శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. నిజాం పాలన కాలంలో 1940 నుండి 1948 వరకు దాదాపు తొమ్మిదేళ్లు నిజాం సంస్థానంలో న్యాయవాదులు సమ్మె చేసి సుదీర్ఘ ఉద్యమాన్ని ఉదృతం చేసిన చరిత్ర ను తెలియజేశారు.
దాశరథి కృష్ణమాచార్య నిజామాబాద్ జిల్లా జైలులోని గోడల పైన బొగ్గు తో లిఖించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే చారిత్రాత్మక పద్య గేయమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన చరిత్రను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చరిత్ర, సాహిత్య రంగాలలో పరిశోధన చేసి పి. హెచ్. డి (డాక్టరేట్) పొందిన డాక్టర్ శమంత, డాక్టర్ ధమని సాయిలు, డాక్టర్ ముబీనుద్దీన్ , మాడపాటి కుమారస్వామి, బాధర వేణి నాగరాజు, క్యాతం నరేందర్, చౌకే జగదీశ్వర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇతిహాస సంకలన సమితి బాద్యులు కందకుర్తి ఆనంద్, చరిత్ర పరిశోధకులు కంద కుర్తి యాదవ రావు, గంట్యాల ప్రసాద్ న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్ పడిగల వెంకటేశ్వర్ వసంతరావు కవులు కాసర్ల నరేష్ రావు చందన రావు బీజేపీ నాయకులు ఎండల సుధాకర్ స్వామి యాదవ్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.