సందర్భమేదైనా ఈ రోజుల్లో చాలామంది జంక్‌ఫుడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పిజ్జాలు, బర్గర్లలో చెడు కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. సినిమాలు, షాపింగ్‌లకు వెళ్లినప్పుడూ జంక్‌ఫుడ్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. చిన్నపిల్లల్ని కూడా సాయంత్రం కాగానే బయటకు తీసుకెళ్లి స్నాక్స్ కొనిపెడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. వీటిల్లో కొవ్వు అధికంగా ఉండడమే కాకుండా.. ఇందులో ఉపయోగించే నూనెను పదే పదే వేడి చేస్తుంటారు. ఇలాంటి పదార్థాల్ని ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత అరుదుగా అయితే పర్లేదు.. కానీ ప్రతిసారీ అంటే మాత్రం.. బయటికి వెళ్లినప్పుడు ఇంటి నుంచి పండ్లు, సలాడ్స్ వంటివి తీసుకెళ్లడం మంచిది. ఒకవేళ వాటిని తీసుకెళ్లలేకపోతే.. బయట దొరికే డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్.. వంటివి తినచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, జీవనశైలిని పాటించడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.