స్వేచ్ఛగా.. స్వతంత్రంగా ఉండాలంటే..?

To be free.. to be independent..?మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే స్వతంత్రంగా జీవిస్తున్నారా లేదా అనేది అసలు ప్రశ్న. స్వతంత్రం అంటే కేవలం డబ్బు, కెరీర్‌ వంటి వాటిలోనే కాదు జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. కాబట్టి స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించ డానికి దోహదపడే కొన్ని అంశాలేంటో తెలుసుకుందాం…
ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేస్తే విజయం మన సొంతమవుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని విషయాల్లో లోపల ఏదో భయం, బెరుకు మనల్ని వెంటాడుతూ స్వేచ్ఛగా జీవించకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మీకు పాటలంటే చాలా ఇష్టం. మీ గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కానీ ఎవరిముందైనా పాడమంటే మాత్రం చాలా భయం. దీనివల్ల మీకున్న అవకాశాలను కోల్పోవడమే కాదు… మీలోని ప్రతిభను నలుగురికీ చూపే అవకాశాన్ని చేజార్చుకుంటారు. దీనికి బదులుగా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం మీ వెంటే ఉంటుంది. అయితే దారిలో అపజయాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. దీని వల్ల స్వేచ్ఛగా మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసే అవకాశం మనకు లభిస్తుంది.
ఆర్థిక స్వేచ్ఛ
మీరు నిజంగా ఎవరిమీదా ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవించాలంటే మీ సంపాదన మీకే ఉండాలి. అయితే సంపాదించే డబ్బును విచ్చలవిడిగా కాకుండా అవసరమున్న సందర్భాల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అంతేగానీ మా డబ్బు.. మా ఇష్టం… దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే భవిష్యత్‌ అవసరాలకు డబ్బు మిగలదు. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఇలా ఇతరుల మీద ఆధారపడటం వల్ల స్వతంత్రం లేకుండా పోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా మన భవిష్యత్తుకు తగ్గట్టుగా మనమే ప్లాన్‌ చేసుకొని పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించగలుగుతాం.
స్వేచ్ఛగా మాట్లాడండి
ఎవరితో అయినా సరే భయపడకుండా మనసులోని భావాలను స్వేచ్ఛగా వెల్లడించే గుణం అలవాటు చేసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడటానికి భయపడితే మనలోని భావాలన్నీ లోపలే మిగిలిపోతాయి. అలా భావాలన్నీ గూడుకట్టుకొని మిగిలిపోయినప్పుడు జీవితంలో అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఒక్కోసారి కెరీర్లో కొన్ని చక్కటి అవకాశాలను కూడా కోల్పోవాల్సి రావచ్చు. మీ జీవితం అలా కాకుండా ఉండాలంటే ఎంతమంది ముందైనా మీ మనసులోని మాట చెప్పడానికి వెనకడుగు వేయొద్దు. ఎదుటివారు మీకంటే వయసులోనో, హౌదాలోనో పెద్దవారని భయపడాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలు తప్పు కానంత వరకు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరులు మీ మీద అభాండాలు వేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా మర్చిపోవద్దు.
మీకు నచ్చిందే…
స్వతంత్రంగా బతకడానికి మంచి నడవడిక, విద్యాబుద్ధులు కూడా చాలా అవసరం. వీటివల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలు అలవడతాయి. అలాగే ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవడమూ ముఖ్యమే. ఇవన్నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడతాయి. అయితే చదువు, ఉద్యోగం విషయంలో వేరొకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు చెప్పిన రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆ వృత్తిలో మీరు ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు. అలా కాకుండా ఎవరో చెప్పారని మీ కెరీర్‌ని ఎంచుకుంటే మీకు నచ్చని వృత్తిలో మిగిలిపోవాల్సి రావచ్చు.
మీకు మీరే…
మీ మనసు స్వతంత్రంగా ఆలోచించాలంటే మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకోవడం మానేయాలి. ఒకరితో పోల్చుకుంటూ ఉండటం వల్ల వాళ్ల దగ్గర ఉన్నదాన్నే మనసు కోరుకుంటూ ఉంటుంది. జీవితంలో మీకు ఎందులో అసలైన ఆనందం లభిస్తుందో మీ మనసు మీకు సూచించలేకపోతుంది. అందుకే ప్రతి విషయంలోనూ మీరే బెస్ట్‌ అనుకోండి. ఇతరులతో పోల్చుకోవద్దు. నెగెటివ్‌ ఆలోచనలను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఇతరులతో పోలిక వల్ల అసూయ, ద్వేషం లాంటి నెగెటివ్‌ ఫీలింగ్స్‌కి మీరు దగ్గరవుతారు. అందుకే మీలో ఉన్న మంచి లక్షణాలను తెలుసుకోండి. ఏదైనా సందర్భంలో ఇతరులతో పోల్చుకున్నా దాన్ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకొని వారిలోని మంచి గుణాలను మీరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా, సేచ్ఛగా ఉంటుంది.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
అన్నింటికంటే ముఖ్యమైనది జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు ఏం అవసరమో గుర్తించి, దాన్ని మీకు మీరే అందించుకోండి. మీ శరీరానికి ఆరోగ్యాన్నందించే అలవాట్లు చేసుకోండి. మీ మనసును మీరే ఇబ్బంది పెట్టకుండా నడుచుకోండి. ఈ క్రమంలో ఇతరులను గౌరవించి, వారితో ప్రేమగా ఉండడమూ ముఖ్యమే. అయితే దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ద
ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడే ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం. అందుకే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం తినడం, వేళకు పడుకోవడం… ఇవన్నీ అలవాటు చేసుకోవాలి.

Spread the love
Latest updates news (2024-06-23 11:21):

causes of NOT increased fasting blood sugar | LK9 does lupron increase blood sugar | j7E tricks to quickly bring down blood sugar levels | blood O9z sugar within eating | apple cider vinegar good 3dE for blood sugar | how much pFS will 5 gram sugar raise blood sugar | h8gh lH7 blood sugar symptoms | normal mmol l blood sugar A5O level | after 10hrs of fasting what my 9W0 blood sugar should read | G2L morning blood sugar levels chart | are eggs bad for your Nbn blood sugar | bxm what is normal fasting blood sugar for pregnancy | things to eat uuH to bring up blood sugar quickly | whqt is normal blood sugar 9DR | tips to ay3 reduce blood sugar | does caffeine complicate blood sugar SM6 control | does low EM1 blood sugar cause lightheadedness | is AC6 80 to low for blood sugar | does malitol raise 73q blood sugar | can flu vaccine raise blood sugar KIy | zap does peanut butter raise and apples blood sugar | ULO signs symptoms of high and low blood sugar | device that cmc monitors blood sugar | foods l3g that can cause high blood sugar | low QQf blood sugar affect on bipolar disorder | does citrus bergamot tea raise blood sugar lsX | Ucn foods to eat if blood sugar is too high | blood sugar report cbd oil | will victoza drop your blood sugar XoJ | blood 3Mj sugar formula reviews | low pBA blood sugar after meal on keto | how many G5r carvs needdd yo raise blood sugar | symptoms of excess Ppt sugar in the blood | how can you measure blood TuD sugar levels | what is the best magnesium 6n9 to lower high blood sugar | needleless blood sugar monitor uk c3V | blood sugar diabetes PJj normal levels | 173 blood Tgk sugar level | does low blood sugar mean you need clC sugar | sugar blood Hrp test name | fasting blood sugar normal range pregnancy lp3 | PMo blood sugar testing band | reasons for increase in fasting blood sugar lWp | will UgJ sinus infection raise blood sugar | do cheerios without uiQ milk spike blood sugar | blood sugar monitor watch siB amazon | blood sugar sex 5Bn magik songs ranked | how to yXM check dogs blood sugar at home | insulin pump not lowering 7s9 blood sugar | does phentermine raise blood TNo sugar