నవతెలంగాణ-శామీర్‌పేట
మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పంచా యతీ కార్యాలయంలో శనివారం ఇన్‌చార్జి ఎంపీడీఓ రవి ఆధ్వర్యంలో సర్పంచ్ ఉడుతల జ్యోతి బలరాం గౌడ్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఉపసర్పంచ్ ప్రదీప్ చెక్ పవర్ కోల్పోవడంతో 7వ వార్డు సభ్యుడు శ్రీశైలం యాదవ్‌కు చెక్ పవర్ ఇవ్వాలని 4వ వార్డు సభ్యుడు సాయి కుమార్ ప్రతిపాదించగా 3వ వార్డు సభ్యులు వినోద్ కుమార్ బలప రచగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎంపీడీఓ రవి తీర్మానించారు. ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులు వెంకటేష్, సుశీల, బాలమని హాజరవ్వగా నవనీత గైర్హాజరయ్యారు.