జూన్‌ 2 నాటికి…కాళోజీ కళాక్షేత్రం

– మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హనుమకొండలోని బాలసముద్రంలో మూడెకరాల్లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం ఈ ఏడాది జూన్‌ 2 నాటికి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో హనుమకొండ శాసనసభ్యులు దాస్యం వినరు భాస్కర్‌తో కలిసి ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. పనులను జూన్‌ 2 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖల కార్యక్రమాల క్యాలెండర్‌లను రూపొందిం చాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆయన ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్‌, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్‌ తిరుమలరావు పాల్గొన్నారు.