– కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజా సమస్యను పరిష్కరిస్తూ అభివద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి అన్నారు. సోమవారం పూర్ణోదయ కాలనీవాసులతో సందర్శించి అనంతరం స్థానిక నాయకులు విజ్ఞప్తి మేరకు వినతి పత్రం అందజేశారు. అభివద్ధి పనులు తెలుసుకొని సంబంధిత అధికారులను వెంటనే అభివద్ధి ప్రారంభించాలని ఆదేశించారు. డివిజన్ పరిసర ప్రాంతాల్లో డ్రయినేజీ, మంచినీరు, సీసీ రోడ్లు తదితర అభివద్ధి ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికంగా సమస్యలుంటే తన దష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, అమ్రేష్ రెడ్డి బీజేపీ నాయకులు మధుకర్ రెడ్డి, వీరేంద్రబాబు, అమర్నాథ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శరత్ చంద్ర, వెంకట్ రెడ్డి, విశాల్ అజరు పాల్గొన్నారు.