నవతెలంగాణ – కూకట్‌పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని కేటీఆర్ కాలనీ మరియు సిక్కుల బస్తీ పరిసర ప్రాంతాలలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో డ్రైనేజ్ వాటర్ వచ్చి చేరుతుందని, అలాగే విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి దోమల వ్యాప్తి ఎక్కువగా ఉందని, అలాగే పందులతో కూడా ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ దష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ స్వయంగా వెళ్లి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్న చెట్లు మరియు పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి ఆ ప్రదేశమంతా శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, షౌకత్ అలీ మున్నా, మోజెస్, వాసుదేవరావు, రాము తదితరులు పాల్గొన్నారు.