డివైఎఫ్‌ఐ యంగ్‌ ఉమెన్స్‌ రాష్ట్ర కన్వీనర్‌గా పఠాన్‌ రోషనీన్‌ ఖాన్‌

– రాష్ట్ర కన్వెన్షన్‌లో నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) యంగ్‌ ఉమెన్స్‌ రాష్ట్ర కన్వీనర్‌గా పఠాన్‌ రోషనీన్‌ ఖాన్‌ (ఖమ్మం) ఎన్నికయ్యారు. కో కన్వీనర్లుగా శతి(హైద్రాబాద్‌),మౌనిక(హన్మకొండ), నీరజ(కరీంనగర్‌), త్రివేణి(సుర్యాపేట) ఎన్నికయ్యారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జరిగిన రాష్ట్ర కన్వెన్షన్‌లో నూతన కమిటీని రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ ప్రకటించారు. కమిటీ సభ్యులుగా ఉష, సుజాత, మానస, శ్రావణి, స్వాతి, సంధ్య, అనూష, మౌనిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కన్వీనర్‌ పఠాన్‌ రోషనీన్‌ ఖాన్‌ మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయనీ, వీటిని అరికట్టాడానికి ప్రభుత్వాలు రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలు అన్ని రంగాలలో వివక్ష గురవుతున్నారనీ, దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ ఉపాధి, సమాన హక్కులకై పోరాడుదామని పిలుపునిచ్చారు.