డీఎంఈ తీరుపై నేడు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో దారవత్‌ ప్రీతిపై జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) రమేష్‌రెడ్డి స్పందించిన తీరును వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ర్యాగింగ్‌ జరగలేదంటూ ఆయన ప్రకటించడాన్ని ఎస్‌ఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ప్రీతికి న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.