డ్రయినేజీ, తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

–  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ డివిజన్‌లో పర్యటన
నవతెలంగాణ-ముషీరాబాద్‌
పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రయినేజీ, తాగునీటి పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. గురువారం ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ డివిజన్‌లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం చౌరస్తా వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టే విధంగా అధికారులు ఆదేశించామన్నారు. వెలుగని వీధిదీపాలకు మరమత్తు పనులు నిర్వహించాలని, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బింగి నవీన్‌, వై శ్రీనివాసరావు, నర్సింగ్‌ ప్రసాద్‌, రెబ్బ రామారావు, శ్రీధర్‌ రెడ్డి, వంగల నర్సింగరావు, బల్ల ప్రశాంత్‌, శివ ముదిరాజ్‌ ,శ్రీధర్‌ చారి, రాజు, రహీం, మహ్మద్‌ అలీ, షకీల్‌, చాంద్‌ పాషా, జీహెచ్‌ఎంసీ డీఈ గీత కుమారి, ఏఈ తిరుపతి, జలమండలి సెక్షన్‌ మేజర్‌ మేనేజర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.