తెలంగాణ మెడికల్ సేల్స్ రిపేరింగ్ యూనియన్ యాన్వల్ జనరల్ బాడీ సమావేశం

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ మెడికల్ సేల్స్ రిపేరింగ్ యూనియన్, నిజామాబాద్ యందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, (AGB) తేదీ 29వ జనవరి 2023 జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం విధానాలు పై చర్చ, మరియు కార్యదర్శి నివేదిక సమర్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి మురళి, సిఐటియు కార్యదర్శి నూర్జహాన్, సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు, ఆధ్వర్యంలో నూతన కమిటీ 2023 ఎన్నుకోవడం జరిగినది. కార్యదర్శిగా వెంకటేశ్వర స్వామి, ప్రెసిడెంట్ గా వచ్చే శ్రీనివాస్ రాజు, కోశాధికారిగా ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎమ్మే కరీముల్లా, అమరజీత్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా మహేష్ కులకర్రిని మరియు పవన్ కుమార్ ఎన్నుకున్నారు. ఈ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కు వందమంది మెడికల్ రిప్రజెంటిటీలు పాల్గొన్నారు.