నన్ను పిలవండి..!

అన్యాయం కాష్టమవుతున్న చోట
కడుపు మంటను సళ్లార్సుకుంట

అబలలు సబలలైన చోట
సంబురంతో సిందులేస్త

పిడికిళ్లు కొడవళ్లై ఎగిసిన చోట
ఎరుపెక్కిన ఎదలకు తోడునౌత

పేదోడికి పట్టం కట్టినచోట
వారి పల్లకీకి పల్లవి నైత

రాజరికపు గోడలు కూలని చోట
ప్రజాగొడవకై కలబడత

అధికార మదంతో అణగదొక్కిన చోట
అణువిస్పోటనమై పేలిపోత

ధర్మం అధర్మమై పెట్రేగి పోతుంటే
పెనుతుఫానై విరుచుకుపడత
అందుకే..
మీరూ నన్ను పిలవండి..!!

– ముక్కాముల జానకీరామ్‌
6305393291