నిజాంబాద్ నగరానికి చెందిన దంపతులకు అరుదైన గౌరవం

నవతెలంగాణ-కంటేశ్వర్
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తూ లీడర్షిప్ ఇతర శిక్షణల్లో విజయవంతంగా పాల్గొన్న నిజామాబాదు నగరానికి చెందిన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. జేసిఐ ఇందూర్ అధ్యక్షులుగా 2014లో పనిచేసిన జిల్కర్ విజయానంద్, 2017 లో అధ్యక్షురాలిగా పనిచేసిన జిల్కర్ లావణ్యలకు ప్రతిష్టాత్మకమైన ఎస్ ఎం ఎ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లు దక్కాయి. జేసిఐ ఇండియా సీనియర్ మెంబర్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ ప్రమోద్ కుమార్ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికేట్లు అందజేశారు. ఎస్ ఎం ఏ అడ్వయిజర్ సునీల్ కుమార్ 2022  చైర్మన్ వినయ్ మెహతా  పాల్గొన్నారు. అదే విధంగా జేసిఐ ఇండియా సీనియర్ మెంబెర్స్ అసోసియేషన్ 2023 చైర్మన్ మనోజ్ టక్కర్ తనకు ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ గా  విజయానంద్ ను నియమించారు.