నేటి నుంచి అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన సభలు

నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో
అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన సభలు ఈనెల 17,18 తేదీల్లో భోపాల్‌లోని లయన్స్‌ క్లబ్‌లో జరగనున్నాయి.మధ్యప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ విశిష్ట అతిధిగా,సంస్థ జాతీయ అధ్యక్షులు డా.వీరేంద్ర సింగ్‌ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నారు. రఘుశ్రీ,నాగ పద్మిని, డా.రామకృష్ణలు భారత్‌ భాషా భూషణ్‌ అవార్డును అందుకోనున్నారు. సతీష్‌ చతుర్వేది లైఫ్‌ టైం లిటరరీ అవార్డును తంగిరాల చక్రవర్తికి ప్రదానం చేయనున్నారు. వీరితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు భాషా వేత్తలకు అవార్డులు అందజేయనున్నారు.