నేడు తెలంగాణ సాహితి ‘మహిళా ఫెస్ట్‌’

–  ప్రముఖుల అంతరంగ ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాయతీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ‘మహిళా ఫెస్ట్‌’ నిర్వహిస్తున్నది. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్యహాల్‌ బైరి ఇందిర ప్రాంగణంలో నిర్వహించనున్న మహిళా ఫెస్ట్‌లో ప్రముఖ కవయిత్రులు, రచయిత్రులు, వివిధ రంగాల్లో ప్రముఖులు ఈ సందర్భంగా తమ అంతరంగాన్ని ఆవిష్కరించనున్నారు. పురిమళ్ల సునంద, తాళ్లపల్లి యాకమ్మ, నస్రీన్‌ఖాన్‌, రూపా రుక్మిణి, సలీమ, విఠలాపురం పుష్కలత, మేరెడ్డి రేఖ తదితరులు మహిళా ఫెస్ట్‌ను నిర్వహించనున్నారు.